రక్షణ అనగా ఏమిటి? దానిని ఎలా పొందాలి?
రక్షణ అనగా ఏమిటి? దానిని ఎలా పొందాలి? ప్రియమైన దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో వందనాలు. చాలా చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది బైబిల్ జ్ఞానం పూర్తిగా లేని బోధకుల వల్ల అర్ధం కాని పరిస్థితికి వచ్చాయి. వారి మిడిమిడి జ్ఞానంతో అర్థం లేని పాండిత్యంతో క్రైస్తవులలో చాలా విషయాల మీద కనీస అవగాహన లేకుండా చేశారు. వాటిలో ఈ రక్షణ అనే అంశం ఒకటి. మన పేజీలో ఇతర బోధకులు, లేదా పేజీల మాదిరిగా కాకుండా, ఒక అంశం మీద పరిపూర్ణ అవగాహన అందించడానికి ప్రతిసారీ ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే రక్షణ అనే అంశం మీద కూడా మంచి అవగాహనను ఏర్పరుచుకునే ప్రయత్నం చేద్దాం. ముందు రక్షణ అనే పదానికి సాధారణ అర్థాన్ని చూద్దాం. ఒక మనిషి మంటలలో చిక్కుకున్నాడు. అతనిని రక్షణశాఖ వారు రక్షించారు. అనగా మంటలలో ఉన్న అంతనిని పూర్తిగా ఆ మంటల నుండి బయటకు తీసుకొని వచ్చారు అని దీని అర్ధం. మరి బైబిల్ లో మన కోసం వ్రాయబడిన రక్షణకు అర్థం ఏమిటి? మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష నుండి తప్పించుకోవడమే రక్షణ. పై వాక్యము నుండి మనము గ్రహించిన అర్థం అదే. ఎవరైతే యేసుని ర...