ఎవరిని ఆరాధించాలి? తండ్రినా ? కుమారుడినా ? పరిశుద్ధాత్మనా?
ఎవరిని ఆరాధించాలి? తండ్రినా ? కుమారుడినా ? పరిశుద్ధాత్మనా? దేవుళ్ళు ముగ్గురు అని త్రిత్వం బోధిస్తుంది. మరి వీరిలో ఎవరిని ఆరాధించాలి? దేవుళ్ళు ముగ్గురు కాదు. మనమంతా దేవుళ్ళమే అని చూడాలి. శరీరకంగా మనము మనుషులం. కానీ ఆత్మ పరంగా మనము దేవునికి పుట్టాము కనుక దేవుళ్ళము అయ్యాము. కీర్తనలు 82:6 మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. ఇప్పుడు వారు ముగ్గురు మాత్రమే కాదు. మనమంతా దేవుళ్ళమే అనే స్పష్టత అందరికీ వచ్చింది అనుకుంటున్నాను. మరి మనందరిలో ఆరాధనకు అర్హులు ఎవరు? ఆరాధన అంటే ఏమిటో తెలిస్తే, ఎవరిని ఆరాధించాలి అనే విషయం తెలుస్తుంది. పాత నిబంధన కాలములో ఆరాధన 2సమూయేలు 15:32 దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక స్థలము కొండ మీద ఉండేది. ఆ ప్రదేశములో ఎలా ఆరాధిస్తారో చూద్దాం. 2 దిన 29 : 27-29 బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలురాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.౹ 28 అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయ...