పోస్ట్‌లు

ఫిబ్రవరి 12, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

న్యాయాధిపతులు

చిత్రం
న్యాయాధిపతులు పుస్తకం సంఖ్య - 7 విభాగం - పాత నిభందన వర్గము - చరిత్ర రచయిత - సమూయేలు రచించిన కాలం - క్రీ.పూ. 1043 - 1004 రచించిన ప్రదేశం - కనాను వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం - 21 యుగం - ధర్మ శాస్త్ర కాలము. న్యా యాధిపతుల పుస్తకం యెహోషువ గారి మరణంతో మొదలవుతుంది. ప్రత్యేకంగా న్యాయాధిపతులు పుస్తకాన్ని ఎవరు రచించారో వివరాలు దొరకనప్పటికీ, యూదుల సాంప్రదాయకంగా వస్తున్న వాడుక చొప్పున ఈ పుస్తకాన్ని సమూయేలు గారే రచించారు అని చెప్పవచ్చు. ఇకపోతే న్యాయాధిపతుల పుస్తకం ఇశ్రాయేలీయులకు రాజరికం మొదలుకాని సమయానికి ముందు వ్రాయబడింది. కనానులోకి ప్రవేశించిన ఇశ్రాయేలీయులు కనానీయుల ఆచారాలను పాటిస్తూ దేవునికి పూర్తిగా దూరమయ్యారు. ఇశ్రాయేలీయులు దేవునికి దూరమవ్వడం, వారిని దేవుడు అన్యులకు అప్పగించడం, వారు మళ్లీ బుద్ధి తెచ్చుకొని మొరపెట్టినప్పుడు ఒక వ్యక్తిని ఏర్పరచి వారిని విడిపించడం, ఇలా విషాదంగా ఈ పుస్తకమంతా రాయబడింది. ఈ పుస్తకంలో సమ్సోను గురించి వ్రాయబడింది. ఈ బహు బలాఢ్యుడు వేల మందిని ఒంటి చేతితో హతమార్చగల యోధుడు. అయితే దెలీలా అనే ఒక స్త్రీ చేతిలో చిక్కి దేవుని అన...