లేవీయ కాండము
లేవీయ కాండము పుస్తకం సంఖ్య - 3 విభాగం - పాత నిభందన వర్గము - ధర్మ శాస్త్రము లో 3వ పుస్తకము రచయిత - మోషే గారు రచించిన కాలం - క్రీ.పూ. 1450 - 1405 రచించిన ప్రదేశం - సీనాయి పర్వతము వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం - 27 యుగం - ధర్మశాస్త్ర కాలము మోషే గారు వ్రాసిన 3 వ పుస్తకము లేవీయకాండము. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో లెవీ గోత్రము వారు యాజకులుగా నియమించబడడం జరిగింది. వీరు పాటించవలసిన పద్ధతులు , దేవునికి అర్పణలు ఇచ్చే సమయంలో విధి విధానాలు అన్నీ ఈ పుస్తకంలో వ్రాయబడ్డాయి. అందువలన ఈ పుస్తకానికి లేవీయకాండము అని పేరు పెట్టడం జరిగింది. ఈ పుస్తకంలో ముఖ్యంగా పరిశుద్ధత గురించి ఎక్కువగా ప్రస్తావన జరిగింది. దేవునికి బలి అర్పించే సమయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలా ఉంటే అర్హత ఉంటుందో, ఈ పుస్తకంలో ప్రస్తావించారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనుషులు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకోవడం చూడవచ్చు. సబ్బాతు సంవత్సరం కూడా ఆజ్ఞగా ఇవ్వబడింది. క్రొత్త నిభందనలో ధర్మశాస్తము గురించి ప్రస్తావించిన చాలా సందర్భాల్లో ముఖ్యంగా లేవీయకాండము లోని అంశాలే ప్రస్తావించబడ్డాయి. దాదాపుగా 20 సార్లు క్ర...