రూతు గ్రంధము
రూతు గ్రంధము పుస్తకం సంఖ్య - 8 విభాగం - పాత నిభందన వర్గము - చరిత్ర రచయిత - సమూయేలు గారు రచించిన కాలం - సుమారు క్రీ.పూ. 1375 – 1050 రచించిన ప్రదేశం - ఇజ్రాయేల్ దేశము వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం - 4 యుగం - ధర్మ శాస్త్ర కాలము. రూతు గ్రంధము ప్రత్యేకించి బోధ చేయనప్పటికీ, చరిత్రను తెలియజేయడం ద్వారా పరోక్షంగా బోధ చేస్తుంది. రూతు గ్రంథము పూర్తిగా రూటు గారి జీవిత చరిత్రను తెలియజేస్తూ వ్రాయబడింది. ఈ గ్రంథంలో రూతు గారు తన అత్త అయిన నయోమికి ఎలా లోబడి జీవించిందో, కుటుంబంలో బంధాల మధ్య ఎటువంటి సఖ్యత గౌరవం ఉండాలో తెలియజేసింది. రూతు గారు పుట్టుకతో మోయాబీరాలు. ఎలీమెలెకు అనే ఒక ఇశ్రాయేలీయుడు యూదా బెత్లహేము నుండి మోయాబుదేశానికి వలస వెళ్లాడు. అతని భార్య పేరు నయోమి. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులకు మోయాబు స్త్రీలైన ఓర్పా , రూతులను ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆ ఇద్దరు కుమారులు మరియు నయోమి భర్త చనిపోవడంతో నయోమి తిరిగి యూదా బెత్లెహెముకు ప్రయాణం అవుతుంది. తన మొదటి కోరలైన ఓర్ఫా, తన అత్తతో రాకుండా వెనుతిరిగి మోయాగదేశానికి వెళ్ళిపోయింది. అయితే రూతు అలా చేయకుండా, తన ...