సంఖ్యా కాండము
సంఖ్యా కాండము పుస్తకం సంఖ్య - 4 విభాగం - పాత నిభందన వర్గము - ధర్మ శాస్త్రము లో 4 వ పుస్తకము రచయిత - మోషే గారు రచించిన కాలం - క్రీ.పూ. 1450 - 1405 రచించిన ప్రదేశం - సీనాయి పర్వతము వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష అధ్యాయాల మొత్తం - 36 యుగం - ధర్మ శాస్త్ర కాలము. మోషే గారు వ్రాసిన 4 వ పుస్తకము సంఖ్యాకాండము ఈ పుస్తకంలో అనేక గణాంకాలు, జనాభా గణనలు, గోత్ర, అర్చక గణాంకాలు మరియు ఇతర సమాచార గణాంక వివరాలు ఉండటం వలన ఈ పేరు పెట్టారు. మరియు వారు గుడారాలు వేసికున్నప్పుడు ఏయే గోత్రములు ఎక్కడ తమ గుడారములు వేసికోవాలనే విషయాలను కూడా వివరించింది. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పూర్తి లెక్కలు అన్నీ ఈ పుస్తకంలో వ్రాయబడినవి. నీళ్ల కోసం ఇశ్రాయేలీయులు మోషే గారిని శోధించడం, ఆయన బండను కొట్టగానే ఆ బండ నుండి నీళ్ళు రావడం ఈ పుస్తకంలో చూడవచ్చు. అరణ్యంలో ఇశ్రాయేలీయుల అతిక్రమం వల్ల దేవుడు విష సర్పాలను వారి మీదకు రప్పించాడు. అవి కరవడం వల్ల చాలా మంది ఇశ్రాయేలీయులు చనిపోయారు. ఆ విషానికి విరుగుడుగా మోషే ఒక ఇత్తడి సర్పాన్ని పైకి ఎత్తడం, అది చూసి ప్రజలు స్వస్థత పొందడం ఈ పుస్తకంలో వ్రాయబడింది. బిలాముని గాడిద మండలించడం కూ...