దశమ భాగాల చరిత్ర..!
దశమ భాగాల చరిత్ర..! ప్రియమైన దేవుని పిల్లలకి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. నేడు ప్రతీ సంఘములో దశమ భాగాల సేకరణ అమలులో ఉంది. దశమ భాగాలు తప్పు అని, తీసుకునే వాళ్ళు ఏదో దొంగలు అని నేను చెప్పబోవడం లేదు. దయచేసి పోస్ట్ పూర్తిగా చదవవలసిందిగా నా మనవి. ప్రతీ నెల వచ్చే జీతములో లేదా ఆదాయంలో 10వ భాగాన్ని దేవుని కొరకు సమర్పించడాన్ని దశమ భాగం సమర్పణ అంటారు. దశమ భాగం గురించి మొదటగా బైబిల్లో ఎక్కడ చెప్పబడింది ? లేవీయకాండము 27:30 భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. లేవీయకాండము 27:32 గోవులలోనేగాని గొఱ్ఱె మేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును. లేవీయకాండము 27:34 ఇవి యెహోవా సీనాయికొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. కొండమీద మోషే గారికి ఇచ్చిన ఆజ్ఞలలో దశమ భాగాలు ఇవ్వడం కూడా ఒకటి . దేవునికి ప్రతిష్టితముగా ఈ దశమ భాగాలను ఇవ్వాలి. ద్వితీయోప 12 : 6, 7 అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు...