ఎవరిని ఆరాధించాలి? తండ్రినా ? కుమారుడినా ? పరిశుద్ధాత్మనా?
ఎవరిని ఆరాధించాలి? తండ్రినా ? కుమారుడినా ? పరిశుద్ధాత్మనా?
దేవుళ్ళు ముగ్గురు అని త్రిత్వం బోధిస్తుంది. మరి వీరిలో ఎవరిని ఆరాధించాలి? దేవుళ్ళు ముగ్గురు కాదు. మనమంతా దేవుళ్ళమే అని చూడాలి. శరీరకంగా మనము మనుషులం. కానీ ఆత్మ పరంగా మనము దేవునికి పుట్టాము కనుక దేవుళ్ళము అయ్యాము.
కీర్తనలు 82:6
మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.
ఇప్పుడు వారు ముగ్గురు మాత్రమే కాదు. మనమంతా దేవుళ్ళమే అనే స్పష్టత అందరికీ వచ్చింది అనుకుంటున్నాను. మరి మనందరిలో ఆరాధనకు అర్హులు ఎవరు?
ఆరాధన అంటే ఏమిటో తెలిస్తే, ఎవరిని ఆరాధించాలి అనే విషయం తెలుస్తుంది.
పాత నిబంధన కాలములో ఆరాధన
2సమూయేలు 15:32
దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను.
దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేక స్థలము కొండ మీద ఉండేది.
ఆ ప్రదేశములో ఎలా ఆరాధిస్తారో చూద్దాం.
2 దిన 29 : 27-29
బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలురాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.౹ 28 అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదముచేయుచుండిరి, దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.౹ 29 వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్నవారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.
ఇలా బలి అర్పించడం, పాటలు పాడడం, బూరలు ఊదడం ద్వారా ఆరాధన జరిగేది.
యిర్మియా 26:2
యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాట లన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.
యెహోవా కొరకు నిర్మించిన మందిరములోనే ఆరాధన జరిగేది. ఆరాధన కూడా నోటితో జరిగేది. అనగా పాటలు పాడడం, స్తుతులు అని నోటితో చెప్పడం జరిగేది.
అయితే యేసు వచ్చాక ఆరాధన చేసే విధానాన్ని పూర్తిగా మార్చివేసారు.
సమరయ స్త్రీ సందర్భంలో యేసుక్రీస్తువారు ఆరాధన గురించి మంచి వివరణ ఇచ్చారు.
యోహాను సువార్త 4 : 21,22
అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.
ఆరాధించే స్థలము మారిపోతుంది అని యేసు చెప్పడం గమనించండి. అంతేకాక అయన కుడా తండ్రిని ఆరాదిస్తున్నట్టుగా స్పష్టం చేసారు. మరి అది ఎటువంటి ఆరాధన?
యోహాను 4:23
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; {మూలభాషలో - వెదకుచున్నాడు.
పాటలతో, నాధములతో, బలులతో, పెదవులతో చేసే ఆరాధన కంటే, ఆత్మతోను, సత్యముతోను ఆరాధన జరగాలని తండ్రి కోరుకుంటున్నాడు. మరి ఈ ఆత్మ ఎవరు? సత్యము ఎవరు?
ఫిలిప్పీ 3:3
ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవునియొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్దాత్మ అని మనకు తెలుసు. పరిశుద్దాత్మ ద్వారా ఆరాధన అంటే పరిశుద్దాత్మ వచ్చిందని చర్చిలో పిచ్చి అరుపులు అరుస్తూ ఎగరడం కాదు మిత్రులారా. ఆత్మ ఏదైతే మనకు చెయ్యమని అప్పజేప్పాడో అది మనం చేస్తే అప్పుడు మనము ఆరాధన జరిగించిన వాళ్ళము అవుతాము.
మరి సత్యము అనగా ఏమిటి?
యోహాను 17:17
సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.
1థెస్సలొనికయులకు 2:13
ఆ హేతువు చేతను, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
వాక్యమును మనస్ఫూర్తిగా అంగీకరించిన వారిలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేస్తుంది. కార్యసిద్ధి అనగా పని చెయ్యడానికి పురికొల్పుతుంది. మనము పని చెయ్యాలి అనే ఆలోచన తెస్తుంది ఈ వాక్యమనే సత్యము. మన పేజీలో దేవుని పని అనగా ఏమిటి అనే పోస్ట్ చదవండి. సత్యము చెయ్యమన్న పని ఏమిటో వ్రాసాను. ఆత్మలను రక్షించడమే సత్యము చెప్పిన పని. సువార్త చెప్పడమే ఆ పని.
ఆత్మ ద్వారా, సత్యము ద్వారా ఆరాధన అనగా వాక్యము చెప్పడం ద్వారా ఆత్మలను రక్షించడమే. ఇది నిజమైన దైవరాధన. అట్టివారే కావాలని దేవుడు వెతుకుతున్నాడు.
యోహాను సువార్త 4:23
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; {మూలభాషలో - వెదకుచున్నాడు.
మరి ఆ ఆరాధన ఎవరికి చెయ్యాలి అనే ప్రశ్న ముగిసిపోయింది కాదా. తండ్రి కోసం పని చెయ్యడమే ఆరాధన అని తెలిసింది. అయితే నోటితో చెప్పే కృతజ్ఞతా స్తుతుల మాటేమిటి?
ప్రకటన గ్రంథం 7:10
సింహాసనాసీనుడైన మా దేవునికిని, గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.
మనల్ని రక్షించే బాధ్యతలో తండ్రిది సంకల్పమైతే, దానిని కార్యరూపంలో నేరవేర్చిన యేసుది కూడా ప్రధాన పాత్రే అవుతుంది. అందువలన సింహాసనసీనుడైన తండ్రియైన దేవునికి మరియు గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారికీ కలిపి స్తోత్రము చెల్లించడం మంచిది అని బైబిల్ చెప్పిన సత్యం.
ప్రకటన గ్రంథం 5:13
అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని.
తర్వాతి భాగములో ప్రభువు చిత్తమైతే కలుసుకుందాం.
ఆమెన్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి