బైబిల్ ఎలా చదవాలి?

బైబిల్ ఎలా చదవాలి?


1
. బైబిల్ అనేది మనతో మన తండ్రియైన యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు అని మనసులో ఉంచుకొని చదవండి.


2. బైబిల్ లో చెప్పబడిన అన్నీ విషయాలు మనం పాటించాలి అని కాదు. ఎటువంటి సందర్భంలో( context ) ఎవరికి చెప్తున్నారో చూసి చదువుకోవాలి.
example : మన పేజ్ లో "ఇశ్రాయేలీయుల ఆచారాలను క్రైస్తవులు పాటించవచ్చా?" post ను చదవండి.

3. పాత నిబంధన చరిత్రను మరియు యేసు క్రీస్తు వారి మొదటి రాకను తెలియజేయడం కోసం రాయబడింది అని గమనించాలి.

4. క్రొత్త నిబంధన లో చరిత్రతో పాటు, మనం పాటించవలసిన విషయాలు వ్రాయబడ్డాయి.

5. ఆచరించడానికి క్రొత్త నిబంధనను మాత్రమే ఫాలో అవండి. చరిత్ర తెలుసుకోడానికి మరియు కొన్ని ఆచరణ పద్ధతులకు మాత్రమే పాత నిబంధనను ఫాలో అవండి.

6. బైబిల్ అర్థం అవ్వాలని దేవుణ్ణి ప్రార్థనలో కోరుకోండి.

యాకోబు 1:5
మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.


7. బైబిల్ చదివే సమయంలో Notes Maintain చేయండి. డైలీ ఏమేమి చదివారో షార్ట్ నోట్స్ రాయండి.

8. బైబిల్ చదివే సమయంలో చాలా చోట్ల దేవుని నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయి. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఎటువంటి తప్పు చెయ్యడు. మీకు అభ్యంతరంగా( objectionable ) అనిపించిన విషయాలు కూడా బైబిల్ పూర్తి అయ్యేసరికి క్లియర్ అవుతాయి.

9. బైబిల్ లో రాసిన బాష కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దయచేసి తెలుగు to తెలుగు dictionary దగ్గర పెట్టుకొని చదవటం మంచిది.

11. బైబిల్ కొందరికే అర్థం అవుతుంది, అందరికీ కాదు అనే ఆలోచన మనసులోనుంచి తీసివేయండి. చదువుకున్న ప్రతీ ఒక్కరు అర్థం చేసుకునే అంత సులభంగానే బైబిల్ ఉంటుంది.

12. దయచేసి ఎవరి బోధను మనసులో ఉంచుకొని బైబిల్ చదవకండి. దేవుడే మీతో మాట్లాడుతున్నాడు అని మనసులో ఉంచుకొని మాత్రమే చదవండి.

13. బైబిల్ లో ఉన్న వ్యక్తులు చేసిన పనికంటే , మనకి చెయ్యమని చెప్పిన పనులే మనం చెయ్యాలి. ఎందుకంటే కొన్ని situations వల్ల వాళ్ళు చేసిన పనులు కొన్ని ఉంటాయి. అవి మనం చెయ్యాలని కాదు.

14. దేవుని మీద ఇష్టంతో చదవటం మొదలు పెట్టండి. ప్రేమ లేకపోతే అర్థం చేసుకునే విధానం కూడా మారిపోతుంది. first fill your heart with Love on Him . then start reading.

15. బైబిల్ లో ఉన్న వ్యక్తులు దాదాపు మధ్య ఆసియా కి సంబందించిన వాళ్ళు. వారి ప్రవర్తన మన భారతదేశానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అది గమనించుకోవాలి.

ఉదాహరణకి వైన్ త్రాగటం ఆ ప్రాంతాల్లో జీవించేవాళ్ళకి
weather వల్ల అవసరం. మనకి ఆ అలవాటు లేదు. బైబిల్ లో రాసారు అని మనం కూడా తాగాలేమో అన్న భావన తెచ్చుకోవద్దు. రొట్టె , ద్రాక్షరసము తీసుకునేటప్పుడు మాత్రమే మనం కూడా కొంచెం మాత్రమే ద్రాక్షరసము తీసుకోవాలి.

16. బైబిల్ లో ఏ పుస్తకం ఎవరు ఎప్పుడు రాసారో తెలుసుకుని చదివితే చాలా మంచిది.బైబిల్ గొప్పతనం అర్థం అవుతుంది. మీకు కూడా confusion తగ్గుతుంది.

17. అన్నీ పుస్తకాల లాగా బైబిల్ ను కూడా ట్రీట్ చేయకండి. బైబిల్ లో అన్నీ పుస్తకాల లాగా ప్రశ్న , జవాబు ఒకేచోట ఉండదు. చాలా సార్లు ప్రశ్న , జవాబు వేరే వేరే చోట రాయించాడు దేవుడు.

18. ఎన్ని సార్లు చదవాలి అని aim పెట్టుకోకండి. ప్రతిరోజూ చదువుతూనే ఉండాలి.బైబిల్ లో ప్రతిరోజూ కొత్త అంశాలు బయట పడుతూనే ఉంటాయి.

19. సైన్స్, హిస్టరీ ని కూడా కొన్ని సార్లు బైబిల్ తో కలిపి చూడండి. బైబిల్ ఎంత గొప్ప పుస్తకమో మీకు అర్థం అవుతుంది.

20. బైబిల్ అనేది దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళటానికి మాత్రమే రాసాడు అని మైండ్ లో ఫిక్స్ అయ్యి చదవండి. కేవలం ఈ లోకంలో ఆశీర్వాదాలు గురించి మాత్రమే కాదు. బైబిల్ పూర్తిగా చదివే సమయానికి మీకు కూడా ఈ విషయం అర్ధం అవుతుంది.

21. బైబిల్ ని మద్యలో ఓపెన్ చేసి చదవడం, ఒక్క వచనం చదివేసి ప్రార్ధన చేయడం లాంటి పనులు మానుకోవడం మంచిది. సందర్బం, ఎవరు ఎవరికి చెప్తున్నారో తెలుసుకొని, చదివితే చదివిన అంశానికి మనం విలువ ఇచ్చినట్టు అవుతుంది. లేదా చదవకపోవడమే మంచిది.

22. bible చదివాకా మీ స్నేహితులతో ఆ విషయాలను చర్చించండి. అప్పుడే మీరు చదివిన దానికి ఒక పరమార్ధం ఉంటుంది. అన్ని పుస్తకాల లాగా బైబిల్ వ్యక్తిగత జ్ఞానానికి సంభందించిన పుస్తకం కాదు. అందరితో పంచుకోవాలిన దేవుని ప్రేమే బైబిల్

మలాకీ 3:16
అప్పుడు, యెహోవాయందు భయ భక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.

23. బైబిల్ అనేది జ్ఞానానికి సంభందించిన పుస్తకం మాత్రమే కాదు. ఆచరణాత్మకమైనది. మీ జీవితానికి అన్వయించుకోకుండా చదవడం కేవలం వ్యర్థం.

24. వాక్యం అనగా యేసుక్రీస్తు. మీరు యేసుని అర్థం చేసుకుంటున్నారు అని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఆయన మీలో నివసిస్తాడు.
ఆమెన్.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎవరిని ఆరాధించాలి? తండ్రినా ? కుమారుడినా ? పరిశుద్ధాత్మనా?