నిర్గమ కాండము
నిర్గమ కాండము
పుస్తకం సంఖ్య - 2
విభాగం - పాత నిభందన
వర్గము - ధర్మ శాస్త్రము లో 2వ పుస్తకము
రచయిత - మోషే గారు
రచించిన కాలం - క్రీ.పూ. 1450 - 1405
రచించిన ప్రదేశం - సీనాయి అరణ్యము
వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష
అధ్యాయాల మొత్తం - 40
యుగం - ధర్మ శాస్త్ర కాలము.
మోషే గారు వ్రాసిన 2 వ గ్రంధము నిర్గమ కాండము.
నిర్గమము అనే పదానికి అర్థము వదిలి వెళ్లడం, బయటకు రావడం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు వచ్చిన సంఘటన వలన ఈ పుస్తకానికి నిర్గమకాండము అని పేరు వచ్చింది.
ఈ గ్రంధములో ముఖ్యంగా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరములు ఐగుప్తు బానిసలుగా జీవించడం, ఆ బానిసత్వం నుండి వారిని దేవుడు మోషే గారి ద్వారా ఎలా విడిపించాడో చూడవచ్చు.
మోషే గారి పుట్టుక, ఆయన ఇశ్రాయేలీయులను ఎలా ఐగుప్తు నుండి రక్షించాడు, మొదలైన అంశాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి.
ఐగుప్తు ప్రజలకు దేవుడు తెగుళ్లు రప్పించడం, ఎర్ర సముద్రం రెండుగా చీలడం లాంటి అద్భుతమైన సంఘటనలు ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వ్రాయబడ్డాయి.
అన్య దేవతలను కొట్టివేసి, నేను తప్పా వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని యెహోవా తండ్రి ఆజ్ఞ ఇవ్వడం ఈ పుస్తకములో మొదటిసారి చూడవచ్చు.
మోషే ద్వారా ఆజ్ఞలు మొదటగా ఇవ్వబడింది ఈ పుస్తకంలోనే.
ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను ఇచ్చి, వారి పురోగతికి మార్గాన్ని దేవుడు ఏర్పరచడం ఈ పుస్తకంలో ముఖ్యమైన విషయం.
మందసము తయారు చేయడం ఈ గ్రంధంలో చూడవచ్చు.
ఇశ్రాయేలీయుల సంప్రదాయాలు దాదాపుగా అన్నీ ఈ పుస్తకంలో మొదలు అవుతాయి.
రేపటి భాగంలో 3వ పుస్తకం గురించి తెలుసుకుందాం.
నిర్గమ కాండము వీడియో క్రింద ఇవ్వబడింది.








కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి