ద్వితీయోపదేశ కాండము

ద్వితీయోపదేశ కాండము 

పుస్తకం సంఖ్య - 5

విభాగం - పాత నిభందన

వర్గము - ధర్మ శాస్త్రము లో 5 వ పుస్తకము
రచయిత - మోషే గారు

రచించిన కాలం - క్రీ.పూ. 1450 - 1405
రచించిన ప్రదేశం - యోర్దాను తూర్పు వైపు ప్రాంతం

వ్రాయబడిన భాష - ఆదిమ హీబ్రూ భాష
అధ్యాయాల మొత్తం - 34
యుగం - ధర్మ శాస్త్ర కాలము.

మోషే గారు వ్రాసిన 5వ పుస్తకం ద్వితీయోపదేశ కాండము

ద్వితీయోపదేశము అంటే రెండవసారి ఉపదేశించడం అని అర్థము. లేదా మరలా ధ్యానించడం. ఈ గ్రంధములో ఇశ్రాయేలీయులకు నలభై సంవత్సరాల క్రితం నిర్గమకాండము మరియు లేవీయకాండములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలను మోషేగారు మరల రెండవసారి ఉపదేశించాడు.


వాగ్ధాన దేశములో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న ఇశ్రాయేలీయులకు ఈ పుస్తకం వ్రాయబడింది. వాగ్ధాన దేశములో ఎలా జీవించాలో, దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో సూచించిన పుస్తకమే ద్వితీయోపదేశకాండము.

ద్వితియోపదేశకాండము 7:9
కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు, తన్ను ద్వేషించువారిలో ప్రతివానిని బహిరంగ ముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలిసికొనవలెను.

40 సంవత్సరాల క్రితం ఐగుప్తులోనుండి బయలుదేరి కనాను దేశానికి బయలుదేరిన ఇశ్రాయేలీయులలో మొదటి తరం పూర్తిగా నశించింది. రెండవ తరం మాత్రమే వాగ్ధాన దేశానికి చేరుకోడానికి సిద్ధంగా ఉంది. ఆ రెండవ తరానికి 40 సంవత్సరాల ముందు బోధించిన ఆజ్ఞలన్నింటినీ మరొకసారి మోషే గారు బోధించారు. అందువలన ఈ గ్రంధానికి ద్వితీయోపదేశ కాండము అని పేరు వచ్చింది.

ఈ పుస్తకంతో ధర్మశాస్త్రము ముగించడమైనది. మోషే గారు వృద్ధాప్యంలో వ్రాసిన గ్రంధం ఇది. ఆయన ఇశ్రాయేలీయులతో తన చివరి మాటలు మాట్లాడారు.

మోషే గారు యేసుక్రీస్తు వారి మొదటి రాకడ గురించి ఈ గ్రంధములో ప్రస్తావించారు.


ద్వితియోపదేశకాండము 18:16
నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.

మోషే ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలను పెద్ద రాళ్లు నిలబెట్టి వాటి మీద వ్రాయాలని మోషేగారు ఇశ్రాయేలీయులకు చెప్పడం జరిగింది.

తర్వాతి పుస్తకం గురించి ప్రభువు చిత్తమైతే తర్వాతి భాగములో మాట్లాడుకుందాం.

ఆమెన్.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆది కాండము

సమూయేలు మొదటి గ్రంధం